Saturday, June 6, 2009

టీకొట్టు - పాయింటు పట్టు.




నమస్తే..
వారం తరువాత తిరిగి కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
గతవారం టీకొట్టులో వాదోపవాదానందలహరి ప్రారంభించాను. టీ షాపులో విన్న వివిధ వాదనలు నాలో రేపిన ఆలోచనలకు ఈ కథా రూపం ఇచ్చాను.

ఆ కథ వివాదాస్పదమైనది.
సహజన్యాయ సూత్రాల కనుగుణంగా నేను ఆకథలో పాత్రలను అనుకున్నాను.
ఆ కుటుంబం - శ్రీలంక
తండ్రి - లంక ప్రభుత్వం
పెద్దకుమారుడు - తొలితరం తమిళనాయకులు
చిన్నకుమారుడు - ప్రభాకరన్
పక్కింటి సుబ్బారువు ఎవరో మీకిదివరకే తెలిసి ఉంటుంది.
ఆయనే - మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
ఇప్పుడు, కథలో మీరు పోల్చుకున్న, వ్యక్తంచేసుకున్న అభిప్రా.యాలతో వాస్తవం కలిపి ఆలోచించండి.
శ్రీలంక పోరులో లక్షమందివరకూ అమాయక ప్రాణాలు బవలికాబడ్డాయి.
ఆ మరణించిన పేదగొంతుకల నిస్సహాయరోధనలు వినండి.
కకావికలమైన ఆ కుటుంబాల గాథలు తలుచుకోండి.
ఫలితం ఏమిటి,
ఫణంగా పెట్టింది ఏమిటి క్షీరనీరన్యాయంగా వివేచించండి.
కాసేపు.. టీ తాగుతూ...

1 comment:

Anonymous said...

THIS IS WHAT EVERY ONE SHOULD THINK.