Sunday, July 5, 2009

గాయపడిన వేణువు




నువ్వు
నల్లగా ఉన్నా, తెల్లగా మారినా
మా హృదయాలను ఊరడించావు, వెర్రెక్కించావు
చావును కొని తెచ్చుకున్నావు.
వేణువులా
శరీరం నిండా గాయాలతో
రంగస్థలంపై నర్తించిన నీవు యువరక్తకెరటాల జయఘోషవు
గ్లోబుటాపుపై
నీ అడుగుల కదలికల
లయలు
పడిలేచిన కెరటాల వంటి
వంటి విరుపులు మాకు ఇంకా కొత్తే.
కోట్లాది అభిమాన హృదయ
సామ్రాజ్యంలో పెళ్లుబికే మత్తుకుబానిసగా మారావు
ఆడడంకోసం
పాడడం కోసం
వెర్రెక్కించే వేగంతో ఆడుగుల లయ విన్యాసంకోసం
శరీరంలోని అస్థిపంజరాన్ని ఫణంగా పెట్టి
మూన్ వాక్ చేయడానికి
నింగికి వెళ్లిపోతే
ఇక్కడ
వేణువు నిలువెళ్లా గాయపడింది. రంగస్థలం మూగబోయింది.
యస్ ఇటీస్ ఇన్ మ్యూట్.

2 comments:

Anonymous said...

so fine and good.

Anonymous said...

caalaa bagunnadi