Sunday, November 30, 2014

 కవిత్వం (mannava gangadhara Prasad)

పగటి వేళ వెలుగు లేకపోతే కవిత్వం
రాత్రి నిండా వెన్నెల నిండినపుడూ కవిత్వం.
జీవితంలో
అందరిముందూ
తల దించుకోవలసిన వారే మహా దర్జాగా
లజ్జావిహీనంగా
బోర విరుచుకుతిరుగుతూ ఉంటే
కవిత్వం ఎందుకు రాదు?
పతనమవడం కనుల ముందే జరుగుతూ ఉంటే కవిత్వం కాదో!
ఎదుటివారికి హితువు చెబుతూ
తమ తప్పు కాచుకునేవారికి
ఊకదంపుడు మాటకారుల
మోసగింపుల కేళికి..
బోలుబుర్రల-కీలుగుర్రాలకీ కవిత్వం అక్కరలేదా??
కుళ్లిపోతున్న ముఖం నిండా
మేకప్‌ అలముకుని
అలవికాని అజ్ఞానానికి
అహంకారం జతకలుపుకుని
తిరుగుతున్న వారి తీరు చూసినపుడు
కవిత్వం రాదే..
నిమ్మళంగా
నిర్వహిస్తున్న ఆత్మవంచనల
క్రతువులో తలమునకలైన వారిని
కనినపుడు కవిత్వం రాదా! ?

No comments: