Saturday, July 19, 2008

అంతిమగీతం

ఇది నా
స్మృతిగీతం -
ఇపుడు నేను
చితాబస్మం -
పొలాల పైన,
జలాల పైన
హిమాలయాల పైన
చల్లడానికి సిద్దం -
కోట్ల కోట్ల శవాల
దహనాలకు నేను
తాజా ప్రతిరూపం -
శ్మశానమే అంతరికీ
చివరి ప్రస్తానం -
ఉఛ్వాసాలతో నిశ్వాసించిన
ఊహలు పచ్చి మోసం -
అస్తికలు మిగిలిపోయిన
ఆశలు రాస్తున్న శాసనం-
ఇంతకంటే మనిషికి
దక్కేది పూజ్యం -
వెంట తెచ్చింది
గణించశక్యంగాని శూన్యం -
చివరకు మిగిలింది
కాలి బూడిదైన అహం -
సత్యం తెలుసుకోక పోవడమే పాపం -
కట్టెకాలినా కలలు కాలకపోవడమే శాపం.

No comments: