నా యవ్వనమంతయు
నిర్వేదాంతఃపురమందు
నిష్పలమాయెను.
ఆవరించిన చీకటి
తొలగించు వేకువ తెలియక విలపించెను.
నిరాసక్తజలధి ఛోదక శక్తిని
నిలువెల్ల ముంచివేసెను.
చలనరహితముగ
క్షణముల యుగములు
దొర్లించితి
బతుకుబోర్లించి.
అంధకారమునార్పి
కర్తవ్యజ్యోతుల
వెలిగించు చిన్న
చేయి ఆసరాకై
అర్రులు చాచిన
ఆత్మ, ముకులిత
హస్తాలతో వేడుకొన్నది
విన్నదిలేదు వేయి దేవుళ్లలోనెవ్వరూ.
ఎవ్వరూ.... దరిచేరి..
దారి చూపుట కు
పక్రమింపలేదు కదా.
వాస్తవమునకు హృదయములేదా.
-మన్నవ గంగాధరప్రసాద్
1 comment:
హృదయము లేకపోతే ఇలా స్పందించేవారా చెప్పండి!!!
బాగుంది మీ స్పందన....
Post a Comment