కొత్త సంవత్సరానికి స్వాగతం..
మనసు ముక్కలు కాక ముందే వచ్చినందుకు ధ్యాంక్స్.
మనిషి ఎపుడో హద్దులు గీసేసుకున్నాడు.
మమతలు వికసించడం మరిచిపోయాయి.
ఇక్కడ
కొత్త సరిహద్దులు పుష్పించే రుతువు నడుస్తోంది.
పతాకలు ధరించిన విద్యార్ధులు
జాతి హృదయంపై కబాడి ఆడుతున్నారు.
హితులారా
ఎవరి నిరుద్యోగం నిర్మూలించడానికి
మీ జీవితాలను బలి చేస్తున్నారు?
వైయక్తిక ఆకాంక్షకు,
సమూహం బలికావడం సవకాలీనతా
తెలుగు జాతి ముందున్న మార్గ మేమిటి?
- మన్నవ
5 comments:
bagundi..
23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
http://creativekurrodu.blogspot.com/
Happy New Year :)
fine and good
baagundi
idi javaabu leni prashna
baagunnadi baasu
Post a Comment