Sunday, March 25, 2012

రెఫ్యూజిజం

రెఫ్యూజిజం

నేను
స్వంత ఇంట్లో కాందశీకుణ్ని.
నట్టింట్లో నిర్వేదం చెక్కిన శిల్పాణ్ని.
హృదయవిదారకమావర్తించిన కెరటాన్ని.
కఠిన హృదయాలను కన్నీటితో కడిగి,తడిపి చెక్కి,
నా వర్తమాన జీవన శిల్పానికి ప్రాంణంపోశాను.
నూరువిధాలుగా నలిగిపోతూ
నవ్వుతూ నొసలు చిట్లించే విద్యావిశారధులమద్య
నిర్జీవత నటిస్తున్నాను. నిజానికి
నేను ఏనాడో మరణించాను.
కట్టెను కాల్చలేని నిస్సహాయతతో
నీరులేని పంటులు పండించడానికి
తాపత్రయపడుతున్నాను.
నా ఇంట్లోనే నేను శరణార్ధుల శిబిరంలోలా
బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నవాణ్ని.
నాగదిలో నేను రెండవ తరగతి పౌరుణ్ని.
వివాహమనే నేరానికి పాల్పడిన కారణంగా
బతుకు నుంచీ బహిస్కృతుణ్ని.
మనోవేదనాద్వీపాంతర ఏకాంతవాసిని.
నిరంతరాంతరంగరోదనాగానలోలుణ్ని.
నేను
ఆక్రోశాన్ని కూడా వెళ్లగక్కలేనినిస్సహాయుణ్ని.
-- మన్నవ గంగాధర ప్రసాద్‌   (25.3.2012)

3 comments:

babu said...

kaviatalo sandhrata caala teevramgaa undi.
totalgaaaaa bagundi

Anonymous said...

very good, me kavitha caalaa manchigunnadi

sathyam

Anonymous said...

eee kavitha naaku nachindi