Friday, July 27, 2012

 ఎవరి ఖర్మమిది!?    

జీవితాలను ఆక్రమిస్తున్న అవినీతి జాడ్యతిమిరాకాశంలో
తొలి వెలుగు బొమ్మల వర్మ, మన నాగ మారుతీ శర్మ.


ఇప్పటికే.. గుండెలనిండా ఆవహించిన అగాధాల నా జాతి,
పట్టుతప్పిపోతున్న జీవన యానానికి మిగిలిని ఆశాజ్యోతి

కరుడుగట్టిన అవినీతి శిలాజాలాల కింది లభించిన ఆశాస్ఫూర్తి
న్యాయదేవత పంచన  అణగిమణగి నిలుచున్న ధర్మమూర్తి


రాటుదేలిన అక్రమార్జనాపరుల వలలనుంచీ తప్పించుకున్న నీతిజలచరం
మనసుకలిగిన కొద్దిపాటి  మనుషుల లోగిల్లలో మొలిచిన  అపురూపవరం

కర్తవ్యనిర్వహణీయంలో కాళ్లకింద నేల పగులుతున్నా
తొణకని ఓ నాగ మారుతీ  శర్మా!
సమకాలీన సమాజంలో  మీ లాంటి  మరికొన్ని
ఆశారేఖలు  లేకపోవడం మా ఖర్మ!


మన్నవ గంగాధర ప్రసాద్‌

4 comments:

Anonymous said...

manakharmame idi

Anonymous said...

hope more good people will come soon..

Anonymous said...

varthamana smajam lo manishi kosam vedkadam vrudha

Anonymous said...


idi vasthavam gurooo...