Friday, August 31, 2012

అప్రకటిత కరవు

అది మనిషి మనసులోపలి కుహరం
అది మలిన మగత దాల్చిన రూపం.

బహు ముఖాలుగా విచ్చిన్నమయిన విగ్రహం
ఇహపరాలెరుగని విళయకీళల ఆగ్రహం

వెలుపల వెలుగులు విస్తరిస్తున్నట్టు నటిస్తూ
లోలోపల చికటిహోమమంత్రాలను స్మరిస్తూ
సంచరించే సజీవ కపట నాటకరంగస్థలం.

ఏకకాలంలో అనేకానేక పాత్రలను అవలీలగా అభినయించే కొలను.
బహిరంతరాల్లో కఠిన ఖడ్గాలను దాచుకున్న నమ్మలేని విలను.

మహమ్మారిలాగా కమ్ముకున్నస్వచర్మరక్షణారోగలక్షణాల గనులు.
కాచుకుంటూ, సంచరించే విద్వేషాగ్నులుదయించే కోల కనులు.

మనిషి మృగంగా మారిపోయిన జాడలు కూడా కనిపించని
విస్తారోన్మాద సేద్యవిలాసిని.

కాలం ఎంత ప్రమాదకరమయిందో గ్రహించు నేస్తం
మార్పు నీ కళ్లకు నకిపించకుండా పన్నుతుంది కుతంత్రం.

క్షణాలన్నీ అడుగులుగా మారి, జారి పోతూ ఉంటే
అనుభవాలు భుజాలకెక్కి నర్తిస్తుంటాయి.

చివరకు మనకు మిగిలేది మాటల బరువు
ఆశించినది అందుకోలేని అప్రకటిత కరవు.

.. .. మన్నవ గంగాధర ప్రసాద్‌ ( ౩౦812 )
resor och flygbiljetter onlineFree  Web Counter

1 comment:

Anonymous said...

bagundi sir, mee kavitha...babu says