ÑçßýÓâZ§æþÄæý$…
ఇవ్వాళెందుకో
చనిపోతాననిపించింది
భయవిహ్వళత శరీరం అంతా
పాకి చెమటలు పట్టేసింది
గుండెల్లో తడి
ఆరిపోతున్నట్టు
నోరు ఎడారిగా
మారుతున్నట్టు అనిపించింది
నిలువెత్తు నా శిలా
విగ్రహం కంపించిపోయింది
కాళ్లకింద కన్నీటి
కాలువలు పారుతున్నట్టనిపించింది
ఒక్కసారిగా లోకంలో
వింత కాతులు నాకళ్లముందే
హరివిల్లులా
ఆవిష్కృతమయినాయి.
ఏవేవో తెలిసీ తెలియన
కలగాపులగపు ఆలోచనలజడి మొదలయింది.
కూర్చున్న నేను
నిలుచున్నట్టు
ఒక్కసారిగా
పడిపోతున్నట్టు
పట్టుకోవడానికి నేనే
పరుగెడుతున్నట్టు,
కాలు జారుతున్నట్టు,
పిడికిళ్లు
బిగుసుకుంటున్నట్టు,
నరాలని తెగి కాళ్లకు
చుట్టుకుంటున్నట్టు,
అనిపించింది.
మౌనరోదనలవేదనాదం
వినిపించింది.
ఈ
ఉదయమంతా
నన్ను స్మశానంలాగా
మోసగించింది.
.. .. మన్నవగంగాధరప్రసాద్ (4912)
No comments:
Post a Comment