Tuesday, August 28, 2012

ఆత్మవంచనాశిల్పావరణం

కలలపై అలల వాన కురిసింది
మెత్తని తెల్లని ఇసుకలా వర్తమానం కరిగిపోయింది.
నాజూకు కులుకుల లోయలో
నడుస్తున్న ఆలోచనల అశ్వం
నెమ్మదిగా వేగం తగ్గించి
నిటారుగా తలెత్తి సూర్యున్ని చూసింది.
రెండు పార్శ్వాలు..
సత్యాసత్యాల నిలువెత్తు శిఖరాలు..
ఆది నుంచి లోకులు తెలుసుకోవాలనుకునే
అకుపచ్చని, తడి ఆరని నిజాల జాడలు
ఆ.. అనంత శీర్షికల నడుమ. . .
రేఖలుగా జాలువారుతున్న
వెలుగు పరదాల కరకుదనానికి
కదులుతున్న కాలం గుర్తుకు వచ్చింది.
ఇది సమయాసమయాలను వీక్షించే
రహస్య ప్రదేశం కాదు.
మానవాళి
మారణహోమం రగిలిస్తున్న
నగరం నడిబొడ్డు.
బొడ్డురాయి తెలియని జనుల ఆవాసఘోష.
ఇక్కడ
హననం లయబద్దంగా కదం తొక్కుతూ ఉంటుంది.
అసహనం ప్రతి నిత్యం ఒళ్లువిరుచుకుంటూ ఉంటుంది.
విలయం అప్రతిహతంగా నర్తిస్తూ ఉంటుంది.
విద్వంసరచనావిష్కరణల హేళ వినిపిస్తూ ఉంటుంది.
ఆత్మవంచనాశిల్పావరణం విస్తరిస్తూ ఉంటుంది.
ఎరువుల్లేకుండా ఏపుగా పెరిగిన భవనాల నీడల్లో
మానవత్వానికి సమాధులు తవ్వుతూ ఉంటుంది.
కాలం నిశ్వబ్దంగా కన్నీరుకారుస్తూ ఉంటుంది.
 . .  మన్నవ గంగాధర ప్రసాద్‌ (27812)
Free  Web Counter

5 comments:

Anonymous said...

fine, good poetry

Anonymous said...

fine guru.. fine, baagumdi

Anonymous said...

caala bagundi sir... fine

సృజన said...

చాలా బాగుందండి కవిత.





Anonymous said...

kavith ku muchukOllu ichina meekandariki namassulu

gangadhara