Friday, July 26, 2013

Humanity thirst ?

Humanity thirst ? 

ఇది మాత్రం కథ కాదు.
మనసు నులిమేసే వ్యధ.
ఒక వాస్తవం, పచ్చి నిజం.
మానవ సమాజం ఖచ్చితంగా తల దించుకోవలసిన సందర్భం.

దాదాపు  రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు సంఘటనలు యాదృచ్చికంగానే  జరిగి ఉండవచ్చును. కానీ  . . . . .   

మొదట ఈ విషాదాంత్మక వార్తా కథనం చదవండి.
తమిళనాట.. చెన్నై నగర సమీపంలోని సోలింగనల్లూరు,  సెమ్మంజేరి ప్రాంతానికి చెందిన  చిన్న ఇంటిలో  

ఒక తండ్రి పురుషోత్తమన్ (83), కుమారుడు  మహేంద్రన్ (35) నివశిస్తున్నారు.
చిన్న కుటుబం. నిజానికి చింతలోని కుటుంబంగా ఉండాల్సింది.
కానీ,  చిరి ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన తండ్రికి  ఆరోగ్యం సరిగా లేదు. ఎనభై ఏళ్ల వయసులో మరన్ని కష్టాలు.  పెరాలసిస్ (పక్షవాతం) కారణంగా కాలు, చేయి, నోరు పడిపోయాయి. కుమారునిమీద  ఆదారపడి బతుకు ఈడుస్తున్నాడు. స్వయంగా తనపనులుకూడా ఏవీ చేసుకోలేని నిస్సహాయుడు.

ఇక అతని నలభైఏళ్ల కుమారుడు, ఆటో నడుపుతూ జీవిస్తున్నడు. జీవితంలోని సమస్యలకు తంవంచాడు. కలతచెందాడు. నలత పడ్డాడు. వడలిపోయి, వ్యసనాలకు బానిస అయినాడు. మధ్యం మత్తులో బతుకుబాధలను మభ్యపెడుతున్నాననుకున్నాడు.

చాలాకథల్లో చెబుతున్నట్లు... అది వారిజీవితాల్లో  కాళరాత్తి. ఆ రాత్రి కుమారుడు యధావిధిగా పూటుగా ప్రభుత్వం విక్రయించే మధ్యం సేవించాడు. ఆ రోజు కాళరాత్రి కాబేతోంది   కదా, కాస్త ఎక్కువ మందే  పుచ్చుకున్నాడు. వళ్లు తెలియని స్తితిలో ఇంటికి చేరుకున్నాడు.  ఆ మత్తులో కూడా, కాలూ చేయీ ఆడని తండ్రికి ఇడ్లీ తెచ్చాడు. పొద్దుపోయింది. ఇద్దరూ నేలమీదే, రోజులాగే పక్కపక్కన చాపలపై  పడుకున్నారు. వారు పడుకున్న తరువాత కాళరాత్రి లేచింది.  ఏ అర్థరాత్రో, అపరాత్రో, వేకువ జామునో కుమారుడికి  గుండెపోటు వచ్చింది. సడితెలియకుడానే అతడు ఈ లోకం విడిచి లతండ్రి గుర్తించినా, ఏ సాయమూ చేయలేడు. ఎవరినీ పిలువలేడు, తనకుఊపిరి ఉన్నా, ఉలుకూ పలుకూ లేని కన్నకొడుకు సృహతప్పాడో, మత్తులో ఉన్నడో, మరణించాడో గుర్తించలేడు.  ఇలా ఎంతసేపు. కాలానికి కారుణ్యం గురుతు వచ్చే వరకూ.

కాళరాత్రి నుండి వూడో రోజు ఉదయం. అదికూడా  ఎప్పటిలాగే తెల్లవారింది. కానీ  తనతో పాటూ, ఆ మూసి ఉన్న  ఇంటి నుంచీ  భరించలేని దుర్ఘంధం వెంట తెచ్చింది. చుట్టుపక్కల ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వారు వచ్చి, బలవంతంగా తలుపులుతెరిపించారు.  అక్కడ, నేలపై కుళ్లి, ఉబ్బిపోయి, చీమలు తింటూ, కంపు కొడుతున్న కొడుకు శవం.  దాని పక్కనే, ఈ దుర్ఘంధానికి సృహకోల్పోయి, పడున్న దురదృష్టవంతుడయిన  తండ్రి..  మూడు రోజులు కొడుకు శవం చూస్తూ, తన నిస్సహయ స్థితితో పోరాడుతున్న అభాగ్యుడు.

ఆ ఉదయమే  నేను టీవీ చూస్తున్ననేను, ఇక  చూడలేక మరో చానల్ తిప్పాను. బిబిసి పెట్టాను. అంతా హడావుడి. బ్రిటన్ రాజకుటుబంలో  డయానా పెద్ద కుమారుడు విలియమ్- కేట్ దంపతులకు తొలి సంతానం ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ వార్తను ప్రపంచ మీడియా పండగ చేసుకొంటోంది. కాబోయే రాజుకు రెండు తుపాకులతో సైనిక వందనం కూడానట. అతనికి ఏ పేరు పెడుతారో ప్రపంచ టీవీలే ఊహించి చెప్పేస్తున్నాయి. బ్రిటన్ రాజ వంశ చరిత్రను ఉటంకిస్తున్నాయి.  ఆ బుల్లి యువరాజు ఎక్కడ పెరగబోతున్నాడు, ఏ బడిలో చేరబోతున్నాడు, అక్కడ ఇంతకుమునుపే రాజ వంశస్తులు ఎవరెవరు  చదువుకున్నారు..  అన్నీ వండి వార్చేస్తున్నారు.

ఇక్కడ ఆ అనాధ తండ్రి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. మూడు రోజులక్రితం మరణించిన అతని కొడుకు కుళ్లిన శవాన్ని ఏం చేయాలా అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇది కథ కాదు సుమా, అక్షరాలా వర్తమానంలో నర్తిస్తున్న వాస్తవం.

- మన్నవ గంగాధర ప్రసాద్

3 comments:

Anonymous said...

he got heartattack because he is an alcoholic.
when he and his father is alone he should be more careful about his health
we should face the consequences for the mistakes what we do.

Unknown said...

ఇది కథ కాదు పరమ దారుణ వాస్తవం!చదివితేనే నా హృదయం ద్రవించింది ఇక కళ్ళతో చూస్తే కడుపులో చేయిపెట్టి దేవినట్లనిపిస్తుందేమో!హృదయ విదారకంగా టపా లిఖించారు!పూటుగా తాగకున్నా ఆ రిక్షావాడు గుండెపోటుతో పోయేవాడేమో కాని పక్షవాతగ్రస్తుడైన ఆ ముసలి తండ్రి బతుకు తలచుకుంటేనే కంపరమెత్తుతున్నది!!!

mannava gangadhara prasad said...

టపా చదివి, కామెంట్ పెట్టినందుకు నమస్సులు. వాస్తవమే ఇది. మానవత్వం మరుగవుతున్న సమాజం చూసి, ఆవేదనతో రాసింది. - mannava