Friday, October 4, 2013

శ్రీరామజయం
నమో తిరుమలేశా!            సభక్తిక సమర్పణ  - మన్నవ గంగాధర ప్రసాద్‌

శ్రీనివాసుడుమా ఇలవేల్పు. నేనుపెరిగి,పెద్దయిందంతా ఆయన సంస్థానంలోనే, తిరుపతిలోని బాలమందిరం, ఎస్వీ ఉన్నత పాఠశాల, ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజిలలో చదువుకునే అవకాశం శ్రీనివాసుడు కల్పించిందే. అలా చదువుకుంటున్నపుడు స్కౌట్‌గా, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా నేను కొండపై ఎన్నోమార్లు సేవాకార్యక్రమాల్లో పాల్గొని, ఆ దేవదేవుని తనివితీరా దర్శించుకునే అవకాశం కలిగించిందీ స్వామివారే. నిరంతరంగా ఆలయంలో ఉండగలిగే అదృష్టాన్నిచ్చారు. ఇక ఇవి కాక నా వ్యక్తిగంగా నేను శ్రీవారికి పరమభక్తున్ని ఇవన్నీ నాలో సర్వం విష్ణుమయం అనే నమ్మకాన్ని పెంచి పోషించాయి. ఆ భక్తిభావం కారణంగానే ఈ ద్విపద శతకం రాయించారు. ..    సర్వం విష్ణ్టుమయం జగత్‌.   సకలజనులకు సకల శుభములు.
1. తెలుసుకొమ్మనిజెప్పి తీర్చితినిట్లు వెలుగురేఖలనిచ్చు వెంకటపథము.
2. ఊపిరి నిండిన ఓంకార ఝురి నూహల మేఘాలనూయలలూపి,
3. గజవరదుని మదిలోన నిలిపి వెతలుకూల్చగ నేను వేడుచున్నాను.
4. పరుగు తీసేప్రజల పావర మార్పి దొరలుచున్న మది కుదుటబడనిమ్ము.
5. భూమికి మనిషికి ముదము తె గెను, మినిషికి స్వతహాగ మదము పెరిగెను
6. తనను మించినవాడు తానెయన్నాడు, ప్రకృతిని హరంచి పతనమయ్యాడు.
7. పరుల వంచించుచూ.. పరుగులుపెట్టు, సిరులు కూర్చుటొకటే స్థిరమనినమ్ము
8. ప్రకృతి వనరుల పాతరేయుదురు, వికృత మనములావిష్కరించేరు .
9. మన్నుకు కీడెంచి, మనసును దాచి మిన్నుకు చేరుటే మిన్నగ నెంచు
10. చావురాదని ఎంచి చాలదోచుకొను జీవుల మార్గము చిత్రించు స్వామి
11.  పాపుల పాపాలు పరిగణించేవు నీవుకదా దిక్కు నిర్వేదమందు
12. వనములు, జలములు వరుసగ నున్న వనరులు దోచుచు వగచుచున్నాడు
13. శ్రీనివాసా నీవె సిరుల రాశివయ నేనిటు వేడెద నిత్యము నిన్నె.
14. తిరుమల దేవరా తిమిరహరుడవె.. మరులను దుంచవే.. మహితగుణనిధి
15. ఏడుకొండలవాడ ఏమివ్వగలను? పాడుకొందును నీదు పాట నిత్యమ్ము
16. కనులకు శాంతిని కలిగించు రేడు జనులకు ఆశలు శ మియింపువాడు
17. సంచిత పాపాల సంఖ్యను దునిమి ఇంచుక సౌఖ్యాలనివ్వుము స్వామి
18. గతజన్మ కర్మల ఖాతాలు మాన్పి సతతము నీనామస్మరణనిమ్ము
19. నీపాద పద్మాల నీడలోనిలిచి ఈ పాప సంద్రాలు నీద వేడెదను
(తిరుమల రాయుడె తిమిరహరుడు) మరులను కూల్చెడు మహిమాన్వితుండు
20. వేంకట నాధుని వివరమునెరిగి సంకటహరణము సాధింతు నేను
21. జీవించు సంపూర్ణజీవిత యాత్ర, సేవించు గోవిందు చివరివరకిక
తిరుమల రాయుడే తిమిరసంహరుడు మరులను దుంచేటి మన ఇల వేల్పు
22. నమ్మికొలుచువారి నట్టింటి వెలుగు -కమ్ముకున్న కష్టాల కరిగించు వాడు
23. తీరని దుఃఖాల తెరలుదాటించు- కోరని సౌఖ్యాల కొలువులందించు.
24. నామ జప క్రతువు నమ్మిన చాలు, తామశములతీర్చి తరియింపచేయు
25. ఏడుకొండలనడుచెవ్వడు, వాని కీడు తుడిచివేయు కేశవుడి తడె!
26. వేదములె శిలలై వెంకన్న గిరులు వేదన హరియించు విష్ణుజాలమ్ము
27. ఈ గాలి, ఈ గిరులీనేల లోన మోగాలి శ్రీవారి ముక్త గీతాలు
28. కరుణించు నందరికష్టకాలమున, సిరులు కూర్చును సదా శిష్టులకెల్ల
29. ఆకాశమంతున్న యాతనలైన మోకాలిమెట్లుకే ముగియించుస్వామి
30. శ్రీనామమొకసారి చిత్త మునన్న దీనత తొలగించు దేవుడితండు-
31. ముక్కోటి దేవుళ్లు ముంగిట నిలిచి అక్కున జేరిచి ఆదరించేరు.
32. కన్నీరు నిండిన కాలమందున్న  పన్నీరుకురిపించు పరమశులభుడు
33. కాలినడకన నీగానము చేయు కూలిన బతుకుల కోర్కెలు తీర్చు
34. ఆపదమొక్కుల ఆర్తిని దీర్చు నీపద దాసుల నిత్యము స్వామి)))))))
35. సకల జనులకు హాసము కలిగించు సకలశుభములనొసగుము శ్రీనాథ
36. కోనేటిరాయుడు కోర్కెల హరుడు  ఏనోట పలికినా ఎరుక కల్గించు.
37. తిరుమల రాయుని తేరోత్సవమ్ము సిరులిచ్చు, మలిజన్మ చిక్కులు దీర్చు.
38. పాడవో శ్రీహరి పాటనిత్యమ్ము- ఆడవో ఈ దేవునాటలే నీవు.
39. ఊకదపుడు మాటలూపుట నిలిపి నాకము జేర్చు శ్రీనామముననుము .
40. తిమిరసంహారము తిరుమలయనిన, నిమిషమైనా మది నిలిపికొలువుము .
41. కమనీయ రూపము కనులార చూసి, కమలాక్షుప్రార్థించ, కష్టాలు తొలగు .
42. శ్రీనాథుడీ స్వామి సిరులిచ్చువాడు, మీనాక్షినాథుని మిక్కిలి ప్రియుడు .
43. శ్రీహరే గమ్యము, చివరిదీజన్మ. మోహము తొలగించి మొక్కెదమిపుడు .
44. శ్రీవారిపాదాలు శిరసానమామి, శ్రీవారి నామాలు చిరసా స్మరామి .
45. మలయప్పనామము మదిదలవండి. వెలలేని విభవమ్ము వేంకటపతియె .
46. ఆదిమూలమితడే, అన్ని జీవులకు. వేదస్వరూపమీ వేంకటేశ్వరుడు .
47. గుణముల తత్వమ్ము గురుతు చేసి - ఎరుగవలయు దారి నెరుక పరచును .
48. మోహాంబంధాలను మొగ్గలో త్రుంచి, దేహవాంఛలు వీడి దివిజేరుటెరుగు. .
49. గోవులకాపరీ గోవిందుడేను- ఆవులై మోరెత్తి ఆర్తితో పిలువు .
50. తీర్థ నిలయమగు తిరుమలేశ్వరుడు- స్వార్థచింతన గూల్చు సాలగ్రామనిధి .
51. సంసార సాగర సంకట హరుడు ధీసార గోచర దివ్యరూపమ్ము .
52. జీవన సమరాన చిక్కులు దీర్చు- పావన నామము ప్రహ్లాదవరదు .
53. నీ కొండ శిఖరాలు, నేనెక్కలేను! మాకొంగు బంగారమా కరుణించు .
54. మరణతాపముతీర్చి, మరుజన్మలేని కరుణజూపించునీ కమలాక్షి సఖుడు .
55. భక్తితత్వముచూపి, భవితను దీర్చి, ముక్తి మార్గముతెల్పుము తిరుమలేశ!
56. కనులుకానని మాకు గమ్యము తెలిపి, తనువుతొలగిపోవు ధన్యతనిమ్ము .
57. ఊపిరి క్రియలోన, ఊహలలోన దాపరిగా ఉండు దామోదరుండు .
58. మరు లతలను తుంచి, మది నిగ్రహించి, తిరుపతినే గొల్చు ధీమతమిమ్ము .
59. ఆలోచనాలోచనాంబుధి నిండి, నా లోని కుటిలత నరికించుస్వామి .
60. మదినిండి అనువుగ మంచిని తెల్పి తుదిదాక నడిపించు తూరుపు దోవ .
61. పూజలు, భజనలు, పూనకమేల? నిజమగు ధ్యానము నిమిషము చాలు!
62. శ్రీనివాసుడు గానశ్రీ లోలుడిలను- వాని పాటలు పాడువాడె ధన్యుడు .
63. కొలిచిన కొలదిగ కోర్కెలుదీర్చు కొలని రేడితనినే  కొలువగరండి .
64. తారతమ్యములేని తాదాత్మతొసగి - చేరి చూచినవారి చీకాకు తీర్చు .
65. నిత్య కల్యాణశోభ నిండిన కొండ సత్యస్వరూపుని సముఖమే అండ .
66. వేలతీర్ధములిల వెలసిన కొండ - వేలాది క్షేత్రాల వేల్పుల విడిది దండ .
67. వరదహస్తముగొల్వ, వరదలౌ సిరులు, కరవుకాటకములు కనుచూడలేవు.
68. నిజపాదపద్మాలు నిత్యస్మరణము, భజియించు వారల భక్తిగెలుచును .
69. తిరువీధినొకమారు తిరుగాడువాని నిరుజన్మ పాపాలు నిర్వీర్యమౌను .
70. నందకాంశము శోక నదముల దాటి ముందు జన్మలకై ముక్తినొసగును .
71. వర్ణణాతీతమ్ము వాగ్దేవికైన స్వర్ణశిఖరములోస్వామి తేజమ్ము .
72. నేలనాలుగుచెరనాలలో లేదు- సాలగ్రామసహిత స్వామిరూపమ్ము .
73. సేవించు, సేవించు, సేవించవయ్య గోవింద సోదరున్‌, గోకులాత్మజుని .
74. శక్తియుక్తులుజూసి సాయములీడు, భక్తి తూకానికి పడిపోవు వాడు .
75. మనసుతెలిసికొని మన్నించుస్వామి - తనను కొలుచువారి తాపములార్పు .
76. క్షణమువీక్షణములక్షణముగచాలు మనలోని పాపాలు మటుమాయమౌను
77. ధన్యత సమకూరు దర్శించినంత- అన్యత మరపించి ఆనందమొసగు .
78. మరణాంత రాంతాన మనవెంటవచ్చు  నిరతము ధ్యానమే నిఖరఫలమ్ము .
79. తిరుగులేనిదికదా తిరుమలేశు కథ పరుగులాపి వినుము పరమపావనము.
80. శక్తికొలది పూజ సలుపువారి మది భక్తి కొలది ముక్తి ఫలములొసగును .
81. గానమె ప్రియమగు కలియుగ విభుడు కానము ఇటువంటి కమనీయ రూపు
82. చెమ్మగిలు కనుల, చేతులనెత్తి నమ్మికతో వేడిన జనులగాచు .
83. దానవగుణముల దహింయించు స్వామి - మానవకల్యాణ మహిమాన్వితుండు .
84. రాగబంధాలను రహియించువాడు భాగవతుల మది ప్రభవించప చేయు
85. ధరణిలోవెలసిన ధార్మిక మూర్తి - తరగని సేవాద్రి తనువైనవాడు .
86. సౌశీల్యమున్నచో సౌఖ్యాలనిచ్చు - ఆశ్రితులయినచో ఆశ్రయమిచ్చు .
87. శ్రీహరికిలలోన చిక్కనిదేమి? పాహి పాహియనిన పరిరక్షణిచ్చు .
88. వందేకలియుగేశ  వందేశివాంశు  వందేతిరుమలేశ, వందేముకుంద .
89. వందేపరంధామ వందేమురారి వందే గజాననా వందే శశాంక .
90. వందేనరరక్ష వందే పరంధామ వందేపరాంతప, వందే శివానంద
91. శ్రీపాదపీఠమేస్థిరమని నమ్ము  - నీపాపహరణము నిక్కమగనగు .
92. శ్రీరామనామాలు చీకాకుతీర్చు -  తీరాలు తెలియని తిమిరాలకూల్చు .
93. దీనుల రక్షించు దివ్యహస్తమ్ము -  హీనులదరిచేర్చు హేరంబుడితడు .
94. ఆశ్రితజనముల ఆర్తిని దీర్చి - ఆశ్రమవాసుల ఆలనజేయు .
95. వరదక్ష వాసిని వదలక కొలువు - మరలపుట్టుకలేని మనుగడనిచ్చు .
96. నీ దాసులము మేము, నీ వండమాకు ఏ దారి నడవాలో ఎరుక పరతువు.
97. రామనామముపాడి రమ్యతనొందు, సోమసారమునాడి స్వామి నెరుగుము .
98. మరణాంతకాలాన మనవెంట వచ్చు నిరతార్థసారమే నెప్పరితనము (నెప్పరి-ఉపాయశాలి)
99. శ్రీనివాసుడు సులభంగసిరులిచ్చువాడు శ్రీనివాసుడు భక్తుల చిక్కులు త్రుంచు.
100. కనులార దర్శించుకమనీయ మూర్తి తనువంత పులకించు తన్మయజ్యోతి .
101. ఒకసారి వీక్షించనొకజన్మ ఫలము - ఒకసారి జపియించనొకయాగలబ్ది .
102. మనుషులు దనముపై మరులుగొనంగ తనువు మరచిపోయి తప్పుచేయుదురు.
103. అభయహస్తమునీది, అనాధనేను శుభమీయమంటిని శుకనాదమోద.. 


No comments: