ఆరని అడవి మంట
కన్నుల నిండా కవిత్వం
కలం నిండా ఒట్టి శూన్యం
ఆకారం లేని వికారాన్ని
ధరించి తిరుగుతున్న ఆలోచనల ఆవరణం
మనసంతా ఒకటే కిలకిలల కలకలం
అవిశ్రాంతంగా
తత్వాతత్వాల వాగులో
ఈదుతున్న అనుభవానికి
తడి అంటకపోవడం...
గాయం ఎన్నిటికీ మానకపోవడం.
కాగితాలు
ఊహలు కబాడీ ఆడుకునే
మైదానాలు
నా,
నావే,
నా స్వంత రాత్రులు
నాతో
వైరాన్ని పెంచే
ఆగర్భ శత్రువులు
నిజమే,
మనిసిగా
మసలుకోవాలనుకోవాలనుకోవడం
వైచిత్రికి
పతాకావిష్కరణే.
కవిత్వం
ఎప్పటికీ
చల్లారని కారుచిచ్చు!!
- మన్నవ గంగాధర ప్రసాద్ (21314)
No comments:
Post a Comment