
ఇది ఒక చిన్న కథ....?!
రామారావు చిరు ఉద్యోగి.
ఆయనకు ఇద్దరు మగ పిల్లలు.
పెద్దవాడు.. రాజు, చిన్నవాడు.. రవికిరన్ వీరిద్దరికీ వయసులో తేడా నాలుగు సంవత్సరాలు.
చిన్న కుటుంబం, చింతలు లేకుండా నడుస్తూ ఉండగా పెద్దవాడు పదవ తరగతి పూర్తి చేశాడు, పాసైతే సైకిల్ కొంటానన్న రామారావు చాలా కారణాలవలన సైకిల్ కొనలేకపోయాడు. ఇంతలో నే రాజు తన ఇంటర్ పూర్తిచేసి, పై చదువులకు వెల్లాడు.
తనకు సైకిల్ కావాలని లోన ఎంతో అశగాఉన్నా తండ్రి ఇబ్బందులు తెలిసి, సమయం వచ్చినపుడల్లా అడగడమే కానీ, కొని తీరాలని రాజు పట్టుపట్టలేదు. కాలేజీకీ, ఇంటికీ, ట్యూషన్లకీ, ఆటపాటలకూ అన్నిటికీ కాలినడకనో, లేకపోతే... సిటీ బస్సులోనో వెళ్లి వచ్చే వాడు.
ఇది, చిన్నవాడైన రవికిరన్ గమనించేవాడు. పాపం అన్న సైకిల్ కావాలనే న్యాయమైన కోర్కె తీరకపోవడం వాడికీ నిరాశ కలిగించింది.
ప్రస్తుతం వాడూ పదవ తరగతి దాటుతున్నాడు, తనకీ సైకిల్ కొనమంటే నాన్న కొనడేమో నని వాడికి అనుమానం.
కానీ, అన్నలా అడిగి అడిగి కాలం వెలిబుచ్చే యోచనలో లేడు.
ఓ రోజు సైకిల్ కొనాలనే విషయంపై ఇంట్లో పెద్ద వాదులాటే జరిగింది.
అదే సమయానికి రామారావు కోసం వచ్చిన పొరుగున ఉన్న సుబ్బారావు కూడా నీకప్పుడే సైకిల్ ఎందుకురా, మేం ఉద్యోగాలు చేస్తూ కూడా సిటీ బస్సులోనే తిరగడం లేదా అని సముదాయిచడంతో ఆయనపై విపరీతమైన కోపం వచ్చింది.
ఓ రోజు అవకాశం చూసుకుని చీకటి పడ్డాక ఒంటరిగా వస్తున్న సుబ్బారావుపై చాటునుండీ రాళ్లతో దాడిచేసి, సైకిల్ వద్దన్నందుకు పగతీర్చుకున్నాడు రవికిరన్.
ఇలా పెడదారి పట్టి,
ఇంట్లో నిత్యం సమస్యలు తెచ్చిపెట్టేవాడు.
వీడి హింసోన్మాదం తట్టుకోలేక వాళ్ల నాన్న వాణ్ని ఓ రోజు ఇంట్లోనుండి వెళ్లిపోరా అన్నాడు.
వాడూ వెళ్లిపోయాడు.
ఈ కథలో విశేషం ఏమీలేదు.....
అయితే చదువరులు ఎవరిని సమర్థిస్థారో....
అన్నది, ప్రపంచంలోని చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
ముఖ్యంగా చదివే వారి మనస్తత్వాన్ని అంచనా వేయడానికి సాయపడుతుంది.
ఇది చర్చకు ఆస్కారం కలిగిస్తుంది.
సరదాగానే అయినా చాలా సీరియస్ అంశాన్ని ముట్టుకున్నాను.
ఇతరులను నొప్పించడా నాకు అభిమతంకాదు.
కానీ చూద్దాం ప్రతిస్పందన ఎలా ఉంటుందో.
కథ వెనుక అసలు రహస్యం త్వరలో చెబుతాను.
- మన్నవ గంగాధర ప్రసాద్.
3 comments:
నేను పెద్దకుమారుడిని సమర్థిస్తాను
కథబాగుంది, సస్పెన్సు ఏమిటో త్వరగా చెప్పు గురువా.
super story
Post a Comment