మరణ సమయం
వేణువూదుతోంది.
కాలమైనది రా!
రా.. రమ్మని పిలుస్తున్నది.
జనన - మరణాల
నాటకం మూసి వే సి
రంకు, బొంకుల రంగులు తుడుచుకో..
ఒరిజినల్ వేషాలు గుర్తు చేసుకో..
కూర్చుకున్న మోహ మాలలను
మార్చుకో..
నా వెనుక నడిచే దారి పోల్చుకో
అంటూ
సరాగాలు పోతోంది.
మరణ సమయం పాట పాడుతోంది.
బతుకులో నిండిన బాధల పల్లవి విడిచి పెట్టి
పరుగు పెట్టిన కాంక్ష తీరాల రాగాలను
గుర్తు చేసుకుంటోంది.
చివరి గీతం, చివరి పాదం
చివరి సారిగా ఆలపిస్తోంది.
ఆలస్యానికి తిట్టి పోస్తోంది.
పాప-పుణ్యాలు తోడిపోస్తోంది.
- మన్నవ గంగాధర ప్రసాద్
No comments:
Post a Comment