మార్పు అనివార్యం అనే గద్ద కత - మన్నవ గంగాధర
ప్రసాద్
అనగనగనగా. . . బందార్ల పల్లి అనే గ్రామంలో గంగాధరం
అనే వ్యక్తి చాలా కాలం క్రితం వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అతనికి పొలంతో
పాటు, పశువులు అంటే కూడా వల్లమాలిన అభిమానం. చావిట్లో ఎప్పుడూ, నాలుగు ఆవులు, రెండు
బర్రెలు, ఓ జత ఎద్దులూ ఉండేవి. ఇంకా ఇంటి నిండా కోళ్లు, కుక్కలు, పిల్లులు చాలానే
కనిపించేవి. అతనికి వివేక్ అని పదేళ్ల కొడుకు ఉండేవాడు. అతను పెద్దవాడు అవుతూ
ఉన్నా, రోజూ రాత్రి నాన్నతో పాటూ పడుకుని కథలు వినడం అంటే ఎంతో ఆసక్తి, సరదా.
అట్లా గంగాధరం తాను విన్నవి, తనకు తెలిసినవీ పోనూ, చాలా కథలు ఆశువుగా చెబుతూ కాలం
గడుపుతూ వస్తున్నాడు. ఒక దశలో పెద్దవాడైనా ఇంకా ఈ కథల పిచ్చి ఏమిట్రా అంటూ విసుగు
చూసేవాడు. కానీ వాళ్లు ఇద్దరూ కథలంటే చెవికోసుకునే లక్షణం ఉన్నవారే కావడంతో ఆ సరదా
అలా కొనసాగుతూ ఉంది. అయితే, ఇట్లా కతలు చెబుతూ తనకు తోచిన నీతి, విద్యార్థుల
వ్యక్తిత్వం తీర్చిదిద్దే అంశాలను చేర్చటం గంగాధరం అలవాటు. కమ్మగా కథరూపంలో మంచి
విషయం చెప్పటం ఓ ప్రయోజనం కూడా అని ఆయన భావన. అట్లా ఒక రోజు రాత్రి గంగాధరం వివేక్
కు చెప్పిన కథే ఈ గద్డ కథ. మనమూ విందాం.. రండి.. మనిషి మారుతూ ఉండాలి. కాలంతోపాటూ
మార్పును స్వంతం చేసుకునేవాడు ప్రగతిసాధిస్తాడు అనే వాస్తవాన్ని హృదయానికి
హత్తుకునేలా తెలియజెప్పేది ఈ గద్ద కథ. ఇది నిజానికి కథ కాదు. వాస్తవం. మనం ఇంతవరకూ
పెద్దగా పట్టించుకోని ఓ నిజం. గ్రామాల్లో ఉంటూ, వనాలకు దగ్గరగా జీవించే వారికి ఈ
వాస్తవం తెలుసు. కానీ ఇపుడు పల్లెల్లో కూడా ఆధునికత ప్రవేశించింది. పచ్చదంన
దూరమవుతూ ఉంది. గంగాధరానికీ వివేక్ కూ మధ్య పాతిక సంవత్సరాల ఎడం. ఈ రెండున్నర
దశాబ్థంలో జీవితం ఎంతగా మారిందంటే, ఓ నిజాన్ని కథగా చెప్పుకునేటంత. అదే విచారం
కలిగించే అంశం. జీవితంలో మనం ఎవర్నికలుసుకోవాలి అన్నది కాలం నిర్ణయిస్తుంది.
జీవితంలో మీరు ఎవరితో ఉండాలో మీ హృదయం నిర్ణయిస్తుంది. అయితే, జీవితంలో ఎవరు మీతో
ఉంటారు, అన్న విషయం మీ ప్రవర్తన (వ్యక్తిత్వం) నిర్ణయిస్తుంది. అట్లాంటి
వ్యక్తిత్వానికి అద్దంపట్టేదే ఈ గద్ద కథ. గద్ద కథ. . . మనలో చాలా మంది ఇదివరకే
ఎన్నో మార్లు గద్దను చూసే ఉంటాం. పక్షి జాతిలో ఎక్కువ కాలం జీవించేవి గద్దలు. ఇవి
సగటున 70 ఏళ్ల వయసు వరకూ జీవించ గలవు. అయితే, ఇంత సుదీర్ఘ జీవితకాలాన్ని
పొందడానికి ప్రతి గద్దా ఓ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుది. గద్దలు ఆకాశంలో
ఎగురుతూ, నేలపై తమ ఆహారాన్ని గుర్తిస్తాయి. వాటిని గద్ద కాళ్లు అమాంతం తన్నుకుపోతూ
ఉండడం మనకు తెలుసు. కానీ గద్దలకు 40 ఏళ్ల వయసు వచ్చే సరికి అంతవరకూ తనకు ఆహారం
సంపాదించడంలో సాయపడిన గోళ్లు పట్టుతప్పుతాయి. ఆహారాన్ని అందుకోలేవు. సూదిలాగా,
పొడవుగా ఉన్న గద్ద ముక్కు, కిందికి వంపు తిరుగుతుంది. దేనినీ అది పట్టుకోలేందు.
వయసుమీదపడడంతో పొడవైన గద్ద రెక్కల్లోని ఈకలు బరువుగా మారి, గుండెలవైపు
ముడుచుకుంటూ, ఎగరడానికి ఉపకరించవు. ఆ దశలో గద్దకు రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి.
ఇకటి వయసయిపోయిందికదా, వేటాడే ఓర్పు, నేర్పు కోల్పోయి. . తిండిలేక మరణించడం.
రెండవది పోరాటం చేసి, కొత్త జీవితాన్ని అందిపుచ్చుకోవడం. ఇందుకు గద్ద సుమారు 150
రోజులు కఠినంగా శ్రమించవలసి ఉంటుంది. సాధారణంగా గద్దలు ఈ రెండవ దారిని
ఎంచుకుంటాయి. ఆ నిర్ణయం తీసుకున్న గద్ద ఓ ఎత్తయిన కొండ శిఖరంపైకి చేరుకుంటుంది.
అక్కడ కొండరాళ్లను, ఊడిపోయేవరకూ ముక్కుతో కొడుతూ ఉంటుంది. పాత ముక్కు ఊడిపోయి,
కొత్తది. బలమైన ముక్కు వచ్చే వరకూ వేచి ఉంటుంది. తరువాత, ఆ కొత్త ముక్కుతో వాడి
తగ్గిన తన కాలి గోళ్లను స్వయంగా పీకి పారేస్తుంది. నొప్పిని భరిస్తూ.. కాళ్లలో
కొత్త గోళ్లు మొలిచిన తరువాత, కాలి గోళ్లు, కొత్త ముక్కు సాయంతో రెక్కల్లోని పెద్ద
ఈకలను పీకిపారేస్తుంది. రెక్కల్లో కొత్త ఈకలు మొలవడానికి కొంత కాలం పడుతుంది.
మొత్తం మీదా ఐదు మాసాల కఠిన శ్రమ తరువాత పూర్తి శక్తితో గద్ద మళ్లీ తన జీవితం
కొనసాగిస్తుంది. మరో 30 ఏళ్లు పూర్వం ఉన్నంత బలంగా, ధీమాతో జీవిస్తుంది. మార్పు
ఎందుకు అవసరం? చాలా సార్లు, మనం జీవించడంకోసం మార్పు సంతరించుకోకతప్పదు. ఒక్కో
సారి పాత అలవాట్లు, ఆచారాలు, జ్ఞాపకాలు విసుగుపుట్టించి, మార్పు కోరుకుంటుంటాం.
పాత బంధనాలనుంచీ బయటపడినపుడే, మనం వర్తమానంలో జీవించగలం. మనకు ఏం ఎదురవుతుందో అన్న
దానిపై మన జీవితాలు ఆధారపడి లేదు. వాటిని మనం ఎలా ప్రతిస్పంధిస్తాం అన్నదానిపై మన
జీవితాలు ఆధార పడి ఉంటాయి. పాజిటివ్ భావన, పాజిటివ్ ఆలోచనలు, పాటివ్ సంఘటనలు,
పాజిటివ్ ఫలితాలను ఇచ్చే ఓ చక్రంగా పరిణమిస్తుంది. మార్పును పొందడానికి మారుదాం.
- మన్నవ గంగాధర ప్రసాద్
2 comments:
సందేశాత్మకం
సందేశాత్మకంగాఉంది, బాగుంది..
Post a Comment